ఆన్ లైన్ లో బిజినెస్ ను ప్రారంభించడం ఎలా?

0
HOW TO START IN ONLINE BUSINESS

అంతర్జాల వినియోగం భారీగా పెరిగిన సందర్భంలో మీ బిజినెస్ ను ఆన్ లైన్ చెయ్యాలనే ఆలోచిన చాలా మంచిందనే చెప్పాలే. కాని మీరు మొదలుపెట్టిన బిజినెస్ వియజవంతం అయ్యేందుకు, బాగా అభివృద్ధి అయ్యేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆన్ లైన్ బిజినెస్ ను ప్రారంభించేందుకు అనుసరించవలసిన ప్రక్రియను ఇప్పుడు చూద్దాం.

1.అవసరాన్ని గమనించి దానిని పూరించడం:

చాలా మంది బిజినెస్ ను ప్రారంభించే సమయంలో చేసే పొరపాటు తాము చేద్దామనుకునే వస్తువుకు లేదా సేవకు మార్కెట్ ఎలా ఉంది అనే అంశాన్ని పెద్దగా పట్టించుకోకపోవటం.
కాని మీ విజయ అవకాశాలను పెంచుకోవటానికి మార్కెట్ పైన దృష్టి పెట్టడం అవసరం. ఇంటర్నెట్ లో ప్రజలు ఎక్కువగా వెతుకుతున్న విషయాలు, ఇంటర్నెట్ లో పూర్తి సమాచారం అందుబాటులో లేని విషయాల పైన సమాచారాన్ని సేకరించి అందుబాటులో పెట్టడం, యూసర్ లు ఎక్కువగా సెర్చ్ చేసే పదాలను కీ వర్డ్ లను తెలుసుకొనటం. ఇతర పోటీదారులను వారి సైట్ లను చూసుకుంటూ వాటిలోని సమాచారాన్ని గమనించడం ద్వారా, వాటి నుంచి కొత్త కొత్త అంశాలను, మెలకువలను నేర్చుకోవడం. తద్వారా మీరు వారికి మరింత గట్టి పోటీని కలుగచేయటం.

2.అమ్మడానికి కాపీలను రాయడం:

బ్లాగ్ కు లేదా వెబ్ సైట్ కు కంటెంట్ ను ప్రతి ఒక్కరు రాస్తారు, కాని ఆ రాసిన దానిని ఇతరులు కొనాలనుకునే విధంగా రాయటం ముఖ్యం. అలా ఉండాలంటే ఒక బ్లాగ్ ను రాసేటప్పుడు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు.

  • హెడ్ లైనే ఇంట్రెస్ట్ కలుగ చేసేదిగా ఉండాలి
  • మీరు అందిస్తున్న వస్తువు లేదా సేవను గురించి మరింత వివరణాత్మకంగా చెప్పటం
  • మీఎరు అందిస్తున్న వస్తుసేవల వలన వారికి కలిగే ఉపయోగాలను వివరించడం
  • వాటిని ఇంతకూ ముందు వాడిన వారి టెస్టిమోనియల్ లను కలిపి చూపడం
  • మీ విశ్వసనీయతను వారికి తెలియచేయడం
  • బలమైన గేరెంటీ చూపించడం.

ఇలా మీ కాపీ మొత్తం కూడా మీ వస్తువు లేదా సేవ ను గురించిన వివరణాత్మకమైన అంశాలను గురించి విషయాలను కస్టమర్ వ్యూ పాయింట్ లోంచి ఆలొచిస్తూ వారికి కలిగే సందేహాలను, ప్రశ్నలను నివృత్తి చేయాలి.

3.వెబ్ సైట్ రూప కల్పన మరియు నిర్మాణం చెయ్యటం:

మీ వస్తువును, దానికి తగిన మార్కెట్ ను సిద్ధం చేసుకున్న తర్వాత మీరు దృష్టి సారించవలసిన అంశం మీ వెబ్ సైట్ ను నిర్మించడం. మీ ఈ చిన్న బిజినెస్ కు ఒక వెబ్ సైట్ రూపొందించడం ఎంతో అవసరం. మీరు మీ వెబ్ సైట్ ద్వారా ఇతరులను లేదా మీ కస్టమర్ లను ఆకట్టుకోవటానికి చాల తక్కువ సమయం ఉంటుంది కాబట్టి ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోవడం ముఖ్యం.
మీ వెబ్ సైట్ రూప కల్పన కాస్త సాధారణంగా ఉండేలా చూడాలి
సింపుల్ మరియు ప్లెయిన్ ఫింట్ లతో లైట్ కలౌరేడ్ బ్యాగ్రౌండ్ లాంటివి ఆకర్షనీయంగా ఉంటాయి
అవసరమైన చోట, కావలనుకున్న చోట గ్రాఫిక్స్ ను ఆడియో వీడియోలను అమర్చడం
సైట్ లో నావిగేషన్ సులభంగా ఉండేలా చూడటం కొనే విధానం సులభతరం చెయ్యటం
కస్టమర్ ఫ్రెండ్లీ గా వెబ్ సైట్ ను రూపొందించడం.

4.సెర్చ్ ఇంజిన్ ల ద్వారా మీకు కొనుగోలుదారులను సమకూర్చడం:

మీరు సృష్టించిన కొత్త వెబ్ సైట్ కు ఒకేసారి ఎక్కువ కొనుగోలుదారులు రావడం అంత సులభం అయితే కాదు గాని పే పేర క్ల్సిక్ ఎడ్వర్టైసింగ్ ద్వారా పని అవుతుందనే చెప్పాలి. సహజంగా మీకు ట్రాఫిక్ రావడానికి ఈ పద్ధతి ఎంతగానో సహాయపడుతుంది. వెంటనే ట్రాఫిక్ రావటమే కాకుండా మీ ఉత్తమ కీ వర్డ్ లను గురించి కూడా మీరు తెలుసుకోవచ్చును. ఆ కీ వర్డ్ లను మీ కాపీ లలో కోడ్ లలో చేర్చడం ద్వారా ఆర్గానిక్ సెర్చ్ రిజల్ట్స్ లో మీ ర్యాంకింగ్ మెరుగు పడుతుంది.

5.మీకంటూ ఒక స్థాయిని ఏర్పాటు చేసుకోవటం:

అంతర్జాలంలో లేని సమాచారం అంటూ ఉండదు, కాబట్టి దానిని మీకు కావాల్సిన సమాచారాన్ని సేకరించి గ్రహించడానికి ఉపయోగించడం. ఎక్ష్పెర్ట్ కంటెంట్ ను ఉచితంగా అందించడం. ప్రజలు తమకు కాల్వలనుకునే సమాచారాన్ని, వారికి కావాల్సిన సమాచారాన్ని అందించడం. మీ వెబ్ సైట్ లో షేర్ ఆప్షన్ ని చేర్చడం ఎంతో ముఖ్యం. ఇండస్ట్రీ ఫోరం లలో, సోషల్ నెట్ వర్క్ లలో మీ సమాచారం ప్రచారం అయ్యేలా చెయ్యటం కోసం షేర్ ఆప్షన్ ఉపయోగ పడుతుంది.

6.ఈ-మెయిల్ మార్కెటింగ్ సహాయం తీసుకోవడం:

మీ వెబ్ సైట్ ఎయి మీ బిజినెస్ కు పునాది, మంచి కస్టమర్ లను సేకరించే ప్లాట్ ఫారం. మీ సబ్ స్క్రైబర్లకు మెయిల్ చేసే అవకాసం ఉంటుంది కనుక దాన్ని మంచి అవకాసం గ ఉపయోగించుకొని మీ వస్తుసేవలకు మార్కెట్ ను పెంచడం ఒక మంచి సులభమైన మార్గం.

7. బ్యాక్ ఎండ్ సేల్స్ :

మీ దగ్గర ఒకసారి వచ్చిన కస్టమర్ లను తిరిగి మళ్ళి మళ్ళి మీ వద్దకే వచ్చేలా చెయ్యటం. ఇది మార్కెటింగ్ లో చాలా మొఖ్యమైన విషయం. వారికి చిన్న చిన్న కాంప్లిమెంటరీ గిఫ్ట్ లను ఇవ్వడం, ఈ-కూపన్ లను ఇవ్వడం, వారికి తగిన ప్రోడక్ట్ లను వారికి చూపించడం. వారి విధేయతకు మీరు కాస్త తోడ్పాటు చూపించినట్లైతే వారు మరింత విధేయంగా ఉంటారు.

Comment using Facebook for quick reply

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here