చిన్న బిజినెస్ లను నిర్వహించే వారికి నిరంతరం ఉండే ఆన్ లైన్ మరియు ఆఫ్ లైన్ కార్యకలాపాలను పర్యవేక్షించడం కాస్త కష్టతరమైన పనిగా చెప్పాలి. వారు నిరంతరం ఎన్నో ఈ-మెయిల్స్ ను, మెసేజ్ లను, ఫోన్ కాల్స్ ను హేండిల్ చెయ్యవలసి ఉంటుంది. అటువంటప్పుడు వారికి టైం management అనేది ఒక సమస్య గా మారుతుంది. కనుక వారికీ టైం మేనేజ్ చేసుకునేందుకు, సరైన ప్లాన్ వేసుకునేందుకు, మరింత ఉత్పాదకంగా ఉండేందుకు వారికి ఉపయోగపడే కొన్ని టైం management అప్లికేషన్లను ఇప్పుడు చూద్దాం.

Asana

NASA, Intel, Samsung, Tesla, Uber ల వంటి అనేక గ్లోబల్ బ్రాండ్ కంపెనీ లు ఉపయోగించే ఆప్ ఇది. అయితే ఇది చిన్న బిజినెస్ లు సైతం afford చెయ్యగలిగే ఒక ఆప్. ఈ ఆప్ ఒక ఫ్లెక్సిబుల్ ఇంటర్ఫేస్ ను కలిగి ఉంటుంది, అలాగే దీనిలోని డాష్ బోర్డు మీ ప్రాజెక్ట్ లు మరియు ప్రోగ్రెస్ కు సంబందించిన సమాచారన్ని మీకు ఇస్తుంది. మీ టీంతో collaberate అయ్యి, మీ ప్రాజెక్ట్ లకు చివరి తేదీలను నిర్ణయించి, ఫైళ్ళను అటాచ్ చేసి, నోటిఫికేషన్ లను పెట్టుకొనెందుకు ఇది ఉపయోగపడుతుంది. అయితే దీని ఫ్రీ వెర్షన్ దాదపు 15 మంది ఉన్న కంపెనీ ల వారు వారి టాస్క్ లు, ప్రాజెక్ట్ లు మరియు సంభాషణల కోసం ఉపయోగించుకోవచ్చును.

Any.do

ఈ ఆప్ ఒక to do list ను, క్యాలెండర్ ను కలిగి ఉంటుంది. ఇది ఒక మంచి డిజైన్ లో రూపొందించబడినది. ఇది మీ పనులను, రిమైండర్ లను, లిస్టు లను, ప్లాన్ లను మీ డివైస్ లన్నిటి లోను Google క్యాలెండరు సహాయంతో sync చెయ్యగలదు. దీనిలోని assistant సహయంతో మీరు మీ పనిని రివ్యూ చేసుకోగలరు. ఈ ఆప్ యొక్క ఫ్రీ వెర్షన్ లో  చాలా రకాలైన ఫీచర్ లు అందుబాటులో ఉన్నాయి.

Timr

Timr ఎప్పటికప్పుడు ఈ అప్లికేషన్ లో కొత్త కొత్త ఫీచర్ లను ఏడ్ చేస్తూ ఒక సమర్ధవంతమైన ఆప్ అనిపించుకోవడంలో ముందు ఉంటుంది. ఒక ప్రాజెక్ట్ కోసం మీరు లేదా మీ ఉద్యోగులు ఎంత సమయాన్ని వెచ్చించారు అనే విషయాన్నీ ఈ ఆప్ ద్వారా మీరు తెలుసుకోగలరు. ముప్పై రోజుల ట్రయల్ లో భాగంగా ఈ ఆప్ ఉచితంగా లభిస్తుంది. మీ బిజినెస్ కు సంబందించిన అనేక పనులను గురించి దీనిని వినియోగించవచ్చును, వాటిలో కొన్ని drive logs, GPS పోజిషన్, ప్రాజెక్ట్ ల ట్రాకింగ్, గంటకి రేట్లు, budget లు వంటివి.

Timely

Calender, టైం ట్రాకింగ్, scheduling, బిల్లింగ్, budget ల వంటి అనేక ఇతర అంశాలను ఈ అప్లికేషన్ ఒకే చోట చేర్చింది.  ఇది సులభంగా ఉపయోగించేలా ఉంటుంది. మీ క్యాలెండరు ను కనెక్ట్ చేసినట్లైతే దానిలోని ఈవెంట్ లన్ని కూడా ఈ ఆప్ తో sync అవుతాయి. ఈ ఆప్ ఫ్రీ వెర్షన్ లభిస్తుంది కాని అందులో మీరు 5 ఆక్టివ్ ప్రాజెక్ట్ లను మాత్రమే చేయగలరు.

Nirvana

ఇది comprehensive గా ఉండే మరొక క్లౌడ్ బేస్డ్ టాస్క్ మేనేజర్ అప్లికేషన్. Nirvana మీకు ముఖ్యమైన వాటిని మీరు మిస్ అవ్వకుండా ఉండేలా చూస్తుంది. Powerful సెర్చ్ దీనిలోని ఒక అద్భుతమైన ఫీచర్. డ్యూ డేట్ లు, చెక్ లిస్టు లు, షెడ్యూల్ టాస్క్ లు, రిఫరెన్స్ లిస్టు లు దీనిలోని ఇతర ఫీచర్ లు. ఇది ఉచిత వెర్షన్ రూపంలో కూడా లభిస్తుంది.

సమయపాలన ఎంతో ముఖ్యమైన విషయం, కాబట్టి మీ బిజినెస్ లో కూడా సమయపాలన ఉండాలని మీరు అనుకుంటే ఈ అప్లికేషన్ మీకు ఉపయోగపడతాయి.

***************************************************************************************************************************

Telugu Video Course on Blogging “How to start a Blog “

బ్లాగింగ్ అనేది ఒకప్పుడు సరదా … ఇప్పుడు బతుకు తెరువు చూపించే ఒక డిజిటల్ మార్గం. మరి బ్లాగ్ స్టార్ట్ చెయ్యాలి అంటే ఎలా ?కోడింగ్ తో పని లేకుండా బ్లాగ్ ఎలా రూపొందించాలి ?బ్లాగ్ లో మనకి ఉపయోగపడే మంచి plugins ఏంటి ? ….

ఇలా బ్లాగ్ గురించి ప్రాక్టికల్ గా వివరిస్తూ నేను చెప్పిన వీడియో కోర్స్ ఆన్ లైన్ లో ఉంది . ఈ లింక్ లో క్లిక్ చేసి కోర్స్ లో చేరితే రిజిస్ట్రేషన్ వివరాలు మీ Email కి వస్తాయి. ఆ వివరాలతో వెబ్ సైట్ లో లాగిన్ అయ్యి ఎప్పుడు కావలి అంటే అప్పుడు కోర్స్ చూసుకోవచ్చు.

కోర్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Comment using Facebook for quick reply

error: Content is protected !!