ఒక ఐడియా మీ జీవితాన్ని మారుస్తుంది ..ఇది ఒక టెలికాం సంస్థ నుండి మనం వింటున్నపాపులర్ ట్యాగ్ లైన్
ఆలా టెక్నాలజీ ని వాడుకొని ఒక్క ఐడియా తో తమ జీవితాన్ని మార్చుకుంటున్నారు మన దేశ యువత.

ఫ్లిప్ కార్ట్ (www.flipkart.com), రెడ్ బస్(www.redbu.in), స్నాప్ డీల్(www.snapdeal.com) లాంటి స్టార్ట్ అప్ ల సక్సెస్ ..ఎటువంటి వ్యాపార అనుభవం లేనప్పటికీ సరయిన ఆలోచన, ఆచరణ , టెక్నాలజీ పై అవగాహన ఉంటె సామాన్యులు కుడా వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించవచ్చు అని నీరుపించాయి.
వాటి విజయాల ఇన్స్పిరేషన్ తో మరెన్నో స్టార్ట్ అప్ ఐడియా లు, కంపెనీ లు పుట్టుకొస్తున్నాయి .వాటిల్లో చాలా వరకు మంచి విజయాలు సాదిస్తునాయి కుడా .

అలాంటి స్టార్ట్ అప్ కంపెనీలు మన తెలుగు రాష్ట్రాల లో కుడా చాలా ఉన్నాయి .అలా మన తెలుగు వాళ్ళు మొదలు పెట్టిన స్టార్ట్ అప్ ల విశేషాలు, వాటి కష్ట నష్టాలు , వాటి విజయ గాధ లు .వాటి వాళ్ళ మనకు ఉపయోగాలు మన స్మార్ట్ తెలుగు లో ప్రచూరిస్తాను.
వాటి విశేషాలు, అనుభవాలు , ఐడియా లు ఇంకొంత మంది కి ఉపయోగపడొచ్చు , మరి కొంతమందిని ఉత్తేజపరచొచ్చు .

చాలా మంది కి మంచి ఆలోచన ఉంటుంది కాని , దాన్ని ఆన్ లైన్ బిజినెస్ గా ఎలా మార్చాలి,ఎలా మొదలుపెట్టాలి, మొదలు పెడితే వచ్చే కస్టాలు , ఆ అనుభవాలు , ఆచరణా విధానం తెలియదు.
ఇక్కడ smarttelugu.com లో మన తెలుగు వాళ్ళ స్టార్ట్ అప్ ల గురుంచి, వాటి ప్రస్థానం గురుంచి చదవటం,ఫాలో అవటం ద్వారా కొంత విషయ పరిజ్ఞానాన్ని పొందచ్చు. మీకు ఆన్ లైన్ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉంటె రెగ్యులర్ గా ఈ బ్లాగ్ ఫాలో అవ్వండి

మీరు గాని ,మీ ఫ్రెండ్స్ గాని మంచి స్టార్ట్ అప్ కంపెనీ లేదా వెబ్ సైట్ లు స్టార్ట్ చేసి ఉంటే దాని విషయాలు మాతో పంచుకోండి…  వివరాలు [email protected]  కి  మెయిల్ చేయండి.

ముఖ్యగమనిక : ఏది పడితే అది అని కాకుండా… మంచి ఆలోచనా,ఆచరణ ,నాణ్యత మయిన సర్వీస్ లు అందిచే స్టార్ట్ అప్ లు, వెబ్ సైట్ ల గురుంచి మాత్రమే ప్రచురింపబడుతుంది.

Comment using Facebook for quick reply

error: Content is protected !!