Telugu Language Content in Internet

0
telugulanguage

తెలుగు నేర్చుకుంటే ఏమొస్తుంది రా ! ఇంగ్లీష్ నేర్చుకుంటే ఉద్యోగం వస్తుంది …ఇది నిన్నటి మాట.
తెలుగు వస్తే …ఇంటర్నెట్ ఉపయోగించుకొని మనం కాళ్ళ మీద మనం నిలబడే ఛాన్స్ వస్తుంది —ఇది ఈ రోజు మాట.

ఈ మధ్యకాలంలో  పేపర్లలో వచ్చిన న్యూస్ ఎంత మంది చూసారో లేదో గాని .. ఇండియాలో గత savastyaram ఇంటర్నెట్ కంటెంట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ౧౦ శాతం పెరిగితే  ప్రాంతీయ భాషల కంటెంట్  70% పెరిగియాయి. అంటే , ఇంటర్నెట్ లో ఎవరి మాతృ భాషలో వారు కంటెంట్ చేయటం, వెతకటం మొదలుపెట్టారు.

జనం ఎక్కడ ఉంటె బిజినెస్ లకి ఛాన్స్ అక్కడ ఉంటుంది .. మరి ఇప్పుడు ఆ జనం అందరూ కంటెంట్ ని తెలుగులోనే చదువుతున్నారు…తెలుగులోనే చూస్తున్నారు. అందుకే ఇంటర్నెట్ లో రాబోతున్న రోజులన్నీ ప్రాంతీయ బాషా రోజులే. వాటికి బలం చేకూర్చే కొన్ని పాయింట్స్ మీకోసం.

ఆన్ లైన్ లో పత్రికలు: ప్రముఖ దినపత్రికలు అన్ని ఆన్ లైన్ మీద ఎక్కువ శ్రద్ద చూపిస్తున్నాయి. ఆ పత్రికలూ ఫాలో అయ్యే వారు ఇప్పటికే ఇది గమనించి ఉంటారు. ఆ పత్రికల వెబ్ సైట్ లలో , మొబైల్ ఆప్ లలో ఎప్పటికప్పుడు న్యూస్ అప్ డేట్ చేస్తున్నాయి. ఆ కంటెంట్ లో చాలా యాడ్స్ మీరు గమనించే ఉంటారు.

T.V యూట్యూబ్ చానెల్స్ : జబర్దస్త్ ప్రోగ్రాం ట్.వి లో ఎంత మంది చూస్తున్నారో దానికి పోటీగా యూట్యూబ్ లో చూస్తున్నారు దీన్ని బట్టి యూట్యూబ్ లో తెలుగు కంటెంట్ సత్తా ఏంటో చూడండి. ఇక సీరియల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది. చాలా మంది మహిళలు “జిఓ ” అంతు చూస్తున్నారు.

కొత్త యూట్యూబ్ చానెల్స్ : ఈ మధ్య యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తే చాలు .. తెలుగు లో .కుప్పలు కుప్పలు గా యూట్యూబ్ చానెల్స్ కనపడుతున్నాయి. ఆ తుమ్బనైల్స్ సంగతి చెప్పకేర్లదు . ఇన్ని చానెల్స్ ఎందుకు పుడుతున్నాయో తెలుసా? తెలుగు యూట్యూబ్ చానెల్స్ చూసే జనం పెరిగిపోయారు గనుక.

కొత్త బ్లాగ్ లు : తెలుగు కంటెంట్ తో బ్లాగ్ లు ఇప్పుడిప్పుడే అడుగుపెడుతున్నాయి. ఇప్పటికి కొన్ని చిన్న అడ్డంకులు ఉన్నాయి .అవి తొలిగిపోతే వీటి రెక్కలు కూడా విస్తరించుకుంటాయి.

మొబైల్ ఆప్ లలో తెలుగు : ప్రెటం లాంటి మొబైల్ ఆప్ లు తెలుగులో నే ఆప్ ని అందజేస్తున్నాయి.

మొబైల్ ఫోన్ లో తెలుగు – మీ భాషలో స్మార్ట్ ఫోన్ ని వాడుకోండి అని స్మార్ట్ ఫోన్ కంపెనీలు అన్ని తెలుగులో సాఫ్ట్ వెర్ అందిస్తున్నాయి.

గూగుల్ లో తెలుగు – ఓకే గూగుల్ , గూగుల్ కీ బోర్డు లాంటి అనేక టెక్నాలజీ సర్వీసెస్ లలో తెలుగు ని కూడా భాగం చేసింది గూగుల్.

ఫేస్ బుక్ – వాట్స్ ఆప్ : తెలుగు వారు ఎక్కువగా వాడుతున్న ఈ రెండు సర్వీస్లు కూడా తెలుగుని వాడుతున్నాయి. ఫేస్ బుక్ ని తెలుగులోనే వాడుతున్నారు. వాట్స్ ఆప్ లో తెలుగు లో టైపు చేస్తున్నారు.

ఇక రాబోయే రోజులలో ఇంటర్నెట్ లో ఇంగ్లీష్ లో పోటీగా తెలుగు రొమ్ము విరుచుకొని నిలబడుతుంది. తెలుగు ఒక్కటే కాదు .. తమిళ్,గుజరాతి, కన్నడ లాంటి భారతీయ ప్రాంతీయ భాషలు కూడా ఇదే దారిలో ఉన్నాయి. దీనికి మంచి సపోర్ట్ దొరికితే మాతృబాషా కి ఇంటర్నెట్ లో ప్రాణం పోసినట్టే.

Comment using Facebook for quick reply

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here