వినరా సోదర .. స్మార్ట్ తెలుగు డిజిటల్ వారి గాధ

ఒకడికి ఐడియా ఉంటది కాని, ఆ ఐడియాని ఆన్ లైన్ బిజినెస్ గా ఎలా మలచాలో తెలియదు. అలాంటి వారికి ఆన్ లైన్ బిజినెస్ ఎలా మొదలుపెట్టాలి, ఎలా చేస్తే మంచిది లాంటి పలు విషయాలు ఈ బ్లాగ్ లో దొరుకుతాయి.ఇంకోకిడికి బిజినెస్ ఉంటుంది కాని, దానిని ఆన్ లైన్ లో మార్కెట్ ఎలా చేసుకోవాలో తెలియదు.అలాంటి వారికి ఆన్ లైన్ మార్కెటింగ్ టిప్స్.

బ్లాగింగ్ ఎలా చెయ్యాలి. బ్లాగింగ్ నుండి మనీ ఎలా సంపాదించవచ్చు అనే సంగతులు. ఆలానే ఇంటర్నెట్ ద్వారా నలుగురుకి ఉపయోగపడుతున్న తెలుగు వారి గురుంచి ఈ బ్లాగ్ లో  వివరించటం జరుగుతుంది.

 ఎవరికీ ఉపయోగం?

కాదేది కవితకి అనర్హం అన్నట్లు …….ఇంటర్నెట్ వీళ్ళకు అనర్హం అన్న మాటే లేదు. సరిగ్గా వాడుకుంటే అందరికి ఉపయోగపడుతుంది.
ఈ smarttelugu.com blog ఆన్ లైన్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అనుకునే వారికి , బిజినెస్ చెయ్యాలనుకునే వారికి , ఇంటర్నెట్ ద్వారా మనీ సంపాదించాలనుకునే వారికి , బ్లాగింగ్ చెయ్యాలనుకునే వారికి, సొంత ఆన్ లైన్ బిజినెస్ కల ఉన్నవారందరికీ ఉపయోగపడుతుంది.

Online Business, Start up,Un-employed, Freelancing  చేసే తెలుగు వారికి  ఈ బ్లాగ్  ఉపయోగపడాలనేది ముఖ్య ఉద్దేశం.

 ఈ బ్లాగ్ ఎందుకు స్టార్ట్ చేసా?

చాల మంది లాగానే ఎందుకు చేస్తునాం రా బాబు ఈ జాబు అనుకుంటా కేవలం నెల చివర్లో వచ్చే శాలరీ కోసం పని చేస్తున్న నాకు….Internet Browsing,Blogging,Startup లాంటి మంచి జబ్బులు అంటుకున్నాయి.ఇంక మనమెందుకు ఆగుతాం?

5 అంకెల శాలరీ , 5 రోజుల పని వదిలి పెట్టి ఆన్ లైన్  బిజినెస్  అనే రంగంలో కి దూకా.ఇంటర్నెట్ మీద ఉన్న వీపరితమయిన ఇంట్రెస్ట్ , ఏదో ఒకటి  సొంతంగా చెయ్యాలి అనే తపన తప్ప….. బిజినెస్ కోసం ఏమి కావాలి, ఆన్ లైన్ మార్కెట్ చేసుకోవాలి లాంటి విషయాలు తెలియక బోల్తా కొట్టాను. కాని ఆ పరిస్థితుల నుండే చాలా విషయాలు నేర్చుకోవటం,చేస్తున్నపనిలో విషయ పరిజ్ఞానం పెంచుకోవటం జరిగింది.

నేను నేర్చుకున్న ఆన్ లైన్ బిజినెస్ విషయాలు , ఆన్ లైన్ మార్కెటింగ్ పరిజ్ఞానం, బ్లాగింగ్ విషయాలు ఇతరులకు  నా ఆర్టికల్స్ ద్వారా తెలియజేయాలి అనుకున్నాను.నేను స్టార్ట్ అప్ స్టార్ట్ చేద్దాం అనుకున్నపుడు నాకు ఇలా చెప్పేవాళ్ళు లేక విలువయిన సమయాన్ని వృధా చేసుకున్నాను. అందుకే  నా ఆర్టికల్స్ ద్వారా ఇతరులకు ఉపయోగపడటానికి  ఒక వేదికగా ఈ www.smarttelugu.com ప్రారంభించాను.

నాకు తెల్సింది, నేను రోజు చదివేది, నేర్చుకున్నది మీతో పంచుకోవటం జరుగుతుంది.

ముఖ్య గమనిక : తెలుగు మీద ఇష్టం తో తెలుగు లో ఈ బ్లాగ్ రాయటం జరుగుతుంది.

ముఖ్యంగా తెలుగు లో అక్షరాలు టైపు చెయ్యటానికి కలిగే ఇబ్బందుల వలనో  లేక ఇంగ్లీష్ మీడియం చదువుల వలనో , ఐ. టి జాబు ల ప్రాభావం వలనో  , ఈ బిజీ లైఫ్ లో మొబైల్ లో, ఈ-మెయిల్ లో మెసేజ్ లు రాయటం తప్ప ఒక కలం పుచ్చుకొని పుస్తకం లో అచ్చ తెలుగు లో మనసులో భావాలు రాసే టైం లేకపోవటం వలనో  గాని  బ్లాగ్ లో  రాసే ఆర్టికల్స్ లో….అక్షరాలూ,హల్లులూ ,అచ్చులూ మొదలగు విషయాలలో  తెలుగు రాతలో కొన్ని  తప్పులు ఉన్నాగాని క్షమించవలసినది గా కోరుకుంటున్నాను.

ఇంగ్లీష్ బ్లాగ్ లకు ధీటుగా తెలుగు బ్లాగ్ ని నీలపాలనె ఉద్దేశంతోనే తెలుగు లో రాయటం జరుగుతుంది.

సందేహాలకు మరియు ఇతర వివరాలకు?

ఏవయిన సందేహాలకు, వివరాలకు   ravikiran@smarttelugu.com కి మెయిల్ చెయ్యండి

మరికొన్ని టిప్స్, ఆన్ లైన్ బిజినెస్ సంగతుల   కోసం smarttelugu facebook page ఫాలో అవ్వండి.

error: Content is protected !!