విజయవంతమైన బిజినెస్ విలీనం కోసం కొన్ని టిప్స్

SUCCESSFUL BUSINESS TIPS

ఒక సంస్థ లేదా బిజినెస్ యొక్క విలీనం లేదా స్వాధీనం అంటే మనసు విరిగిపోవడం కాదు. కాని నిజానికి అది ఒక బుర్ర బద్దలయ్యే పని. ఒక్కోసారి బిజినెస్ విజయం కోసం అలానే బిజినెస్ యొక్క మంచి కోసం తప్పకుండా చేపట్టవలసిన ఒక చర్య.

ఒక్కొక్కసారి చాలా పెద్ద పెద్ద బిజినెస్ లు చేసే వారు కూడా ఈ వేలీనం మరియు స్వాధీనం లా వైపు మొగ్గు చూపిస్తారు, అది ఎంతో విజయవంతమైన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఒక్కోసారి కంపెనీలు తమకు గట్టి పోటీ ఇస్తున్న తమ competitor లను కొనుగోలు చేసి competition ను తగ్గించుకునే ప్రయత్నం చేస్తాయి. ఇలా కారణం ఏదైనప్పటికీ ఈ ప్రక్రియ మొత్తం క్రమబద్దంగా జరుగుతుందనే చెప్పాలి.

ఒకవేళ పరిస్థితుల దృష్ట్యా మీకు మరియు మీ బిజినెస్ కు కూడా ఇటువంటి పరిస్థితే ఏర్పడి ఉంటే మీరు సరైన అంశాల పైన దృష్టి పెట్టి ఈ విలీన ప్రక్రియలో తప్పులు జరగకుండా చూసుకునేందుకు కొన్ని ఉపయోగకరమైన టిప్స్ ఈ క్రింది తెలియచేయడం జరిగింది, వాటిని కాస్త గమనించండి.

మీ సంస్థ యొక్క ఆర్ధిక సమర్ధతను మరియు లిక్విడిటీను

పరిశీలించాలి:

ఈ విలీన ప్రక్రియ అంత సులభమైన విషయం ఏమి కాదు, అటువంటి ప్రక్రియ చేసే సమయంలో మీ బిజినెస్ యొక్క ఆర్ధిక సమర్ధతను మరియు స్థిరత్వాన్ని తప్పుగా అర్ధం చేసుకొనే అవకాశం ఉంటుంది. మాంద్యం సమయంలో అన్ని బిజినెస్ లకు ఒక విషయం తప్పకుండా అర్ధమయ్యి ఉంటుంది, అదే ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కంటే కూడా లిక్విడిటీ కి ఉన్నా ప్రాధాన్యం.

అలాగే మీ బిజినెస్ యొక్క మూలధన స్వరూపం పైన ఒక కన్ను వేసి ఉంచాలి, మరింత భాద్యతను స్వీకరించాగలదా లేదా అనే అభిప్రాయానికి రావాలి. అప్పులను హేండిల్ చెయ్యగలిగి మరియు ఈక్విటీ కాపిటల్ ను నిర్వహించి ఒక పర్ఫెక్ట్ బాలన్స్ షీట్ ను చేయగలిగినప్పుడే మీరు పూర్తిగా ఈ విలీన ప్రక్రియకు సిద్ధంగా ఉన్నట్లు భావించాలి.

ఒక పర్ఫెక్ట్ టీం ను కలిపి ఉంచి సిద్ధం చేయటం:

ఫైనాన్సు, సేల్స్ మరియు మార్కెటింగ్ ఆపరేషన్స్ అనేవి ప్రతి ఒక్క బిజినెస్ లోను ఉండే విభాగాలు. కాబట్టి అన్ని విభాగాలలో ప్రావిణ్యం కలిగిన వారందరినీ కలిపి తయారు చేసిన ఒక టీంను రూపొందించుకోవాలి. అలానే టీం లోని సభ్యలందరూ కూడా కలిసి కట్టుగా పని చేసేందుకు సిద్ధంగా ఉండాలి. అందరి ధ్యేయం ఒకటే అయ్యి ఉండాలి. అందరు తమకు అప్పగించిన భాద్యతలను విధిగా తమ పై అధికారి చెప్పిన విధంగా నిర్వర్తించగలిగే విధంగా ఉండాలి.

విజయం కోసం లక్ష్యాలను ఏర్పరచుకోవడం:

మీకు మీరు కొన్ని ప్రశ్నలను ఎప్పటికప్పుడు సందిన్చుకుంటూ ఉండాలి. మీ విజయం ద్వారా మార్కెట్ లో మీ షేర్ ను మెరుగుపరచాలనుకుంటున్నారా. లేదా కొత్త మార్కెట్ లోనికి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారా. లేదా మీకున్న competition ను తోలిగించుకొనే ప్రయత్నం చేస్తున్నారా. ఇలా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవడం వలన మీ బిజినెస్ కు లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి మీకు ఉపయోగపడుతుంది తద్వారా దారి తప్పకుండా సరైన రీతిలో వెళ్లేందుకు మీకు ఉపయోగపడుతుంది.

సమాచారాన్ని సమర్ధవంతగా మరియు సురక్షితంగా పంచుకోండి:

నేటి మన డిజిటల్ ప్రపంచం చాలా విషయాలను సులభతరం చేసేసింది. కాని ఇదే డిజిటల్ విప్లవం వలన కొన్ని సెక్యూరిటీ సమస్యలు కూడా ఏర్పడుతుంటాయి.

ఈ digitization వలన ఇరు పార్టీలు బిజినెస్ document లను ఒకరితో మరి ఒకరు సులభంగా మరియు సురక్షితంగా షేర్ చేసుకోవచ్చును. Virtual డేటా రూమ్స్ ను సృష్టించి ఖర్చు లేకుండానే ఇరు వర్గాల మధ్య సమాచర మార్పిడి జరిగేలా చూడవచ్చు.

ఉత్తమ బృందాన్ని మీ నాయకత్వం ద్వారా సమకూర్చండి:

రెండు వేరు వేరు కంపెనీ లను విలీనం చేసే ప్రక్రియలో compatibility ఇష్యుస్ తప్పనిసరిగా ఉంటాయి. ఈ ట్రాన్సిషన్ సమయంలో అత్యంత ముఖ్యమైన విషయం సమర్ధవంతమైన లీడర్ షిప్. ఈ ట్రాన్సిషన్ లీడర్ లుగా ఇరు పార్టీ లా నుంచి సమర్ధవంతమైన వ్యక్తులను ఎంచుకోవాలి. తమ బిజినెస్ ల పట్ల తమ దగ్గర ఉన్నా ఉద్యోగుల పట్ల మరియు వారి సామర్ధ్యం పట్ల పూర్తి అవగాహన వీరికి ఉంటుంది కనుక వారు సరైన నిర్ణయాలు తీసుకొని విలీన ప్రక్రియ సరైన విధంగా జరిగే విధంగా చూసుకోగలరు.

************************************************************************************************************************************

Telugu Video Course on Blogging “How to start a Blog “

బ్లాగింగ్ అనేది ఒకప్పుడు సరదా … ఇప్పుడు బతుకు తెరువు చూపించే ఒక డిజిటల్ మార్గం. మరి బ్లాగ్ స్టార్ట్ చెయ్యాలి అంటే ఎలా ?కోడింగ్ తో పని లేకుండా బ్లాగ్ ఎలా రూపొందించాలి ?బ్లాగ్ లో మనకి ఉపయోగపడే మంచి plugins ఏంటి ? ….

ఇలా బ్లాగ్ గురించి ప్రాక్టికల్ గా వివరిస్తూ నేను చెప్పిన వీడియో కోర్స్ ఆన్ లైన్ లో ఉంది . ఈ లింక్ లో క్లిక్ చేసి కోర్స్ లో చేరితే రిజిస్ట్రేషన్ వివరాలు మీ Email కి వస్తాయి. ఆ వివరాలతో వెబ్ సైట్ లో లాగిన్ అయ్యి ఎప్పుడు కావలి అంటే అప్పుడు కోర్స్ చూసుకోవచ్చు.

కోర్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Comment using Facebook for quick reply

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here