Top 6 skills to start and run a startup – Telugu Article

0
startupskills

ఒక ఐడియా రాగానే నేను స్టార్ట్ అప్ పెడుతున్నాను. నాకో స్టార్ట్ అప్ ఉంది, నేనొక స్టార్ట్ అప్ ఓనర్ ని చెప్పుకుంటున్నాము.చెపితే కొంత మంది నొచ్చుకుంటారేమో కానీ కాలిగా ఉన్నాము అని చెప్పలేక చాలా మంది స్టార్ట్ అప్ పెడుతున్నాము అని తీరుగుతున్నారు. అలా స్టార్ట్ అప్ అనేది ఈరోజు మామూలు విషయం అయిపోయింది.

రెండు వెబ్ సైట్ లు ఫెయిల్ అయిన తరువాత నాకు తెలిసినంత వరకు స్టార్ట్ అప్ అనేది మామూలు విషయం కాదు.ఒక స్టార్ట్ అప్ మొదలుపెట్టడానికి , స్టార్ట్ అప్ ని నడపటానికి మనకి ప్రముఖంగా కొన్ని స్కిల్స్ అవసరం.

ప్రతి స్టార్ట్ అప్ ఓనర్ కి వీటిలో అయితే, అన్నిటిలో పండితుడు కావల్సిన పని లేదు గాని అన్నిటి గురించి అవగాహన అవసరం.
ఇక్కడ చెప్పే ప్రతి స్కిల్ కి వర్క్ చేసే కంపెనీలు ,వ్యక్తులు ఉంటారు. కానీ వారితో పని చేయించుకోటానికి,  చేసిన పని సక్రమంగా ఉందొ లేదో చూసుకోటానికి మనకి కనీస అవగాహన ఉండాలి కదా. ప్రతి దాని గురించి మాట్లాడగలిగే విషయసూచిక అవసరం.

Top Skills to Start and Run a Startup:

Legal : కంపెనీ లీగల్ వ్యవహారాలు, రిజిస్ట్రేషన్ లు అనేవి ఒక స్టార్ట్ అప్ కి అవసరమయిన ప్రాధమిక విషయాలు.

Finance : కంపెనీ షేర్స్ , టాక్స్ లు, పెట్టుబడులు , ఫండింగ్ , అకౌంటింగ్ , శాలరీలు లాంటి విషయాలు ఎంత ప్రత్యేకమో చెప్పకర్లేదనుకుంటా.

Technology : ఈ రోజు ఏ ఐడియా అయినా దానికి వెబ్ సైట్ , మొబైల్ అప్ లాంటి విషయాలు మామూలు అయిపోయాయి. ఆ పని చేసే వారితో మాట్లాడటానికయినా సరే మనకి వాటి మీద అవగాహన ఉండాలి.

Marketing : ఎంత చెట్టుకి అంత గాలి ..ఎంత మార్కెట్ చేసుకుంటే అంత గుర్తింపు. ఈ రోజు మార్కెటింగ్ అంటే డిజిటల్ మార్కెటింగ్ . మరి దాని మీద అవగాహన లేకుండా స్టార్ట్ అప్ మొదలుపెడితే ఎలా?

Management skills: స్టార్ట్ అప్ అంటేనే టీంతో వర్క్ చేయటం. సామ,దాన,బేధ,దండోపాయాలు వాడి మనకి కావల్సిన పని చేయించుకోవాలి. మరి ఆ మేనేజిమెంట్ స్కిల్స్ అవసరం.

Network Skills:స్టార్ట్ అప్ వృద్ధిలోకి రావటానికి మన చుట్టూ ఉండే నెట్వర్క్ అన్నిటి కంటే ముఖ్యమయిన విషయం. ఆఫీస్ లోనో, ఇంట్లో కూర్చుని వర్క్ చేస్తే స్టార్ట్ అప్ ముందుకు వెళ్ళలేదు. నలుగురితో కలవాలి , నెట్ వర్క్ ఈవెంట్స్ కి వెళ్ళాలి , పార్టీలకు వెళ్ళాలి, అవసరం లేకపోయినా కొన్ని మీటింగ్స్ ,ఈవెంట్స్ కు వెళ్ళాలి. మరి ఇలా నలుగురితో కలివిడిగా ఉండటానికి మంచి నెట్వర్క్ స్కిల్స్ ఉండాలి.

స్టార్ట్ అప్ లో ఒకరిద్దరు లేదా అంతకంటే ఎక్కువ ఉన్నపుడు , ఒకరికి కొన్ని స్కిల్స్ ఇంకొకరికి ఇంకొన్ని స్కిల్స్ ఉండేటట్టు ప్లాన్ చేసుకోవాలి. కేవలం ఒక్కరే స్టార్ట్ అప్ ప్లాన్ చేస్తే మెల్లగా పైన చెప్పిన ప్రతి స్కిల్ నేర్చుకోవాలి.అలా నేర్చుకోవటం కష్టంగానే ఉంటుంది. కానీ తప్పదు.

Comment using Facebook for quick reply

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here