“అప్పు చేసి పప్పు కూడు” ని మెల్లగా  “తప్పు చేసి పప్పు కూడు” గా  మార్చేసారు జనాలు . కాని  ఆన్ లైన్ బిజినెస్ లో తప్పు చేస్తే మాత్రం “పప్పు బదులు అప్పు కూడు”  తీనవల్సిందే.

ఆన్ లైన్ బిజినెస్ మొదలుపెట్టిన మొదట 3 ఇయర్స్ లోనే 50 % బిజినెస్ లు ఫెయిల్ అవుతాయి. అందుకు కారణం చాలా వరకు స్టార్ట్ అప్ లేదా బిజినెస్ ఓనర్ చేసే కొన్ని తప్పులు.

అలా కామన్ గా బిజినెస్ ఓనర్లు  చేసే తప్పులలో  టాప్  8 మీ కోసం. ఇవి మీరు చేయకుండా చూసుకోండి.

డబ్బు పట్ల ఆత్రం:

బిజినెస్ మొదలుపెట్టిన 6 నెలలోనే లాభం వచ్చేయాలి అని చాలా మంది ఆలోచిస్తారు. బిజినెస్ లో వెంటనే లాభం వస్తే అందరు జాబ్ మానేసి బిజినెస్ చేస్తారు. లాభం రావటానికి టైం పడుతుంది. అంత వరకు వేచి చూసే ప్లాన్ , పెట్టుబడి ఉండాలి అనేది ఆలోచించరు.

జనాలకు ఏమి కావాలో తెలుసుకోపోవటం:

మనకు వచ్చిన ఐడియాతో ఒక వెబ్ సైట్ మనకు నచ్చిన విధంగా రూపొందిస్తాము. కాని అసలు మన బిజినెస్ కస్టమర్ కి ఏమి కావాలి అనేది ఆలోచించము. అంతా మన ఆలోచన , మన ఉహలతోనే ఒక వెబ్ సైట్ ని , బిజినెస్ మోడల్ ని రూపొందించి ఫెయిల్ అవుతాము.

వెబ్ సైట్ ని పట్టించుకోరు :

అసలు ఆన్ లైన్ బిజినెస్ అంటేనే వెబ్ సైట్ తో ముడి  పడి ఉంటుంది. కాని చాలా మంది వెబ్ సైట్ లలో క్వాలిటీ అనేది మిస్ అవుతుంది.
వెబ్ సైట్ మీద మొదట్లో ఉండే ఇంట్రెస్ట్ తరువాత ఉండదు.ఏముందిలే అని ఎవరో ఒక డెవలపర్ చేత తక్కువలో ఒక వెబ్ సైట్ చేయించుకుంటారు.దాని తరువాత అసలు వెబ్ సైట్ గురించి పట్టించుకోరు.

కోచ్ లేకపోవటం :

ఒక గేమ్ ఆడేటప్పుడు కోచ్ ఎంత ముఖ్యమో….బిజినెస్ గేమ్ కుడా అంతే. సలహాల కోసం ఫ్రెండ్స్ ని అడుగుతారు గాని ….బిజినెస్ లో ఎక్స్పీరియన్స్ ఉన్న Business Consultant లను సంప్రదించరు.

కారణం వారికి కొంత ఫీ కట్టాలి. సలహాకు ఫీ ఎందుకేలే అనుకుంటారు. అక్కడే బోల్తా పడతారు.

దొంగ సోషల్ మీడియా :

ఈ రోజు సోషల్ మీడియా పవర్ మాములుగా లేదు. సరిగ్గా వాడుకుంటే బిజినెస్ లకి అమృతం లాంటిది. కాని చాలా మంది ఫేస్ బుక్ లో Fake Like లు , Fake Profiles, Fake Groups , Over Group Postings లాంటి చీప్ ట్రిక్స్ చేస్తూ టైం వేస్ట్ చేస్తున్నారు.అలాంటివి temporary గా మాత్రమే ఉపయోగపడుతాయి.వీటి వలన మన సోషల్ మీడియా ఎకౌంటులు బ్యాన్ అవుతాయి. మంచి బిజినెస్ కి ఎకౌంటు బ్యాన్ అయితే చాలా కష్టం.

వెబ్ ట్రాఫిక్ వస్తే చాలు అనుకుంటారు:

వెబ్ సైట్ కి ట్రాఫిక్ వస్తే చాలు ..ఏదో మేజిక్ జరుగుతుంది అని అపోహలో ఉంటారు.

గూగుల్ నుండి వెబ్ సైట్ కి ట్రాఫిక్ వస్తే సరిపోదు…వచ్చిన జనం నీ సర్వీస్ లేదా ప్రోడక్ట్ కొనాలి. దానికి తగ్గ ప్లాన్ ఉండాలి. వెబ్ సైట్ కి వచ్చిన visitor ని మనం కస్టమర్ గా మార్చుకోవాలి.

కష్టపడటానికి రెడీ గా ఉండరు :

డబ్బు ..ఐడియా ఉంటె సరిపోదు. మన బిజినెస్ కోసం మనమే కష్టపడాలి. ఏదో నలుగురు ఎంప్లాయ్ లను పెట్టి నడిపిస్తాము అంటే కుదరదు. ఎందుకంటే ఎంప్లాయ్ జీతం కోసం మాత్రమే పని చేస్తాడు.

ఇది మన బిజినెస్ మనమే కష్టపడాలి అనేది ఆలోచించరు.

నేర్చుకోరు :

ఆన్ లైన్ బిజినెస్ అనేది సైన్స్ మరియు ఆర్ట్. ప్రతి రోజు ఏదో ఒకటి నేర్చుకోవాలి. కాని చాలా మంది లాభాల గురించి ఆలోచిస్తారు గాని సబ్జెక్టు నేర్చుకోవటం గురించి ఆలోచించరు.

 

మరి ఇలాంటి తప్పులు మీరు చేయకుండా జాగ్రత్త పడండి. తప్పులు చేయటం తప్పు కాదు…ఆ తప్పుల నుండి నేర్చుకోపోవటం తప్పు. మరి ఆ తప్పు మాత్రం చేయకండి.

Comment using Facebook for quick reply

error: Content is protected !!
వెబ్ సైట్ ఆర్టికల్స్ మీ Email కి పొందండి.

వెబ్ సైట్ ఆర్టికల్స్ మీ Email కి పొందండి.

Read Online Business Updates, Startup news in your E-mail

You have Successfully Subscribed!