UNIHALT – పేరెంట్స్ కి ఉపయోగపడే మొబైల్ ఆప్ కంపెనీ పెట్టిన వైజాగ్ కుర్రాళ్ళు

రోల్ నెంబర్ 1 …యస్  సర్, రోల్ నెంబర్ 2 …యస్  సర్ , రోల్ నెంబర్ 3 …Absent సర్ అని పక్కనొడు చెప్పాడు.

సాయంత్రం రోల్ నెంబర్ 3 పేరెంట్స్ స్కూల్ కి వచ్చారు.కాని స్కూల్లో బాబు లేడు.మా బాబు ఎక్కడ అంటే…స్కూల్ యాజమాన్యం టీచర్ ని పిలిచారు.వీళ్ళ బాబు ఇవాళ స్కూల్ కి రాలేదు సర్ అన్నాడు టీచర్.

“అదేంటండి నేనే మా వాడిని స్కూల్ బస్సు ఎక్కించింది,రాలేదు అంటారు ఏంటి”  అంది పిల్లాడి తల్లి.
“అయినా, స్కూల్ కి రాకపోతే మాకు చెప్పాలి కదా…మా బాబు మార్నింగ్ నుండి కనపడకపోతే అసలు మాకు చెప్పలేదు మీరు.ఇదేం నిర్లక్ష్యం, మీ నిర్లక్ష్యం వలెనే బాబు తప్పిపోయాడు అని” ఆవేశపడ్డాడు పిల్లాడి తండ్రి.

ఏదో మాములుగా రాలేదు అనుకున్నాము సర్ , మాకు మాత్రం ఏమి తెలుస్తుంది అన్నాడు స్కూల్ ప్రిన్సిపాల్ .

ఆ పిల్లాడి పేరెంట్స్ స్కూల్ యాజమాన్యం పైన కేస్ పెట్టారు. ఈ వార్త అందరికి తెలిసింది..మిగిలిన పేరెంట్స్ కుడా వచ్చి ఇలా జరిగితే మా పిల్లల సంగతి ఏంటి అని స్కూల్ దగ్గర గొడవ చేసారు.

ఏమి చెయ్యాలో తెలియక స్కూల్ యాజమాన్యం తల పట్టుకు కూర్చుంది.

రొండు రోజుల తరువాత, పోలీస్లు పిల్లాడి ఆచూకి తెలుసుకున్నారు. స్కూల్ బయట బస్సు దిగాక ఆ కుర్రాడిని ఎవరో ఎత్తుకెళ్ళారు. ఎలాగోలా పిల్లాడికి ఏమి కాకుండా పోలీస్లు కేస్ చేధించారు.

స్కూల్ లో సరయిన సెక్యూరిటీ లేదు…పిల్లల గురుంచి ఎప్పటికప్పుడు సమాచారం వారి పేరెంట్స్ కి అందజేయుటలేదు అని పోలీస్ స్కూల్ వారిని మందలించారు.

ఇది కథే అయినప్పటికీ ….ఇలాంటి సంగటనలు మనం రోజు పేపర్ లో చాలా చదువుతున్నాము, T.V లో చూస్తున్నాము.

మరి ఈలాంటి ప్రాబ్లం ని నివారించడానికి , స్కూల్ లో సెక్యూరిటీ సిస్టంని పెంపొందించటానికి
స్కూల్లని ,కాలేజీలని , టీచర్స్ ని , పేరెంట్స్ ని  అనుసంధిస్తూ Unihalt అనే స్టార్ట్ అప్ నెలకొల్పారు Ravi Teja Konathala  మరియు Ravi Raja konathala అనే అన్నదమ్ములు.

Unihalt Founders

వైజాగ్ లో మొదలయిన SunRise Startup Village లో ఫస్ట్ స్టార్ట్ అప్ కంపనీలలో  UniHalt ఒకటి .

మరి ఆ స్టార్ట్ అప్ వివరాలు గురుంచి దాని వ్యవస్థాపకుడు రవితేజని ఆన్ లైన్ లో ఇంటర్వ్యూ చేసాను. మరి ఆ  విశేషాలు మీ కోసం.

Unihalt అప్లికేషను  గురుంచి చెపుతారా ?

Unihalt  మొబైల్ అప్లికేషను Institutes -టీచర్స్- పేరెంట్స్ -స్టూడెంట్స్ ని కలిపే ఒక వ్యవస్థలా పని చేస్తుంది .
ఈ అప్లికేషను ద్వారా ప్రతి ఇన్స్టిట్యూట్ తమ స్టూడెంట్స్ పేరెంట్స్ తో కనెక్ట్ అయ్యి ఉండవచ్చు.

ఈ సర్వీస్ ఉపయోగించుకునే ప్రతి ఇన్స్టిట్యూట్ కి ఒక బయో మెట్రిక్ యంత్రం ఇస్తారు .ఆ సిస్టంలో స్టూడెంట్స్ వేలిముద్ర వేయగానే వారి పేరెంట్స్ కి మెసేజ్ వెళ్ళిపోతుంది . అంటే పిల్లలు ఎప్పుడు స్కూల్ కి వెళ్లారు …ఎప్పుడు బయటకు వెళ్లారు అనేది తల్లి తండ్రుల మొబైల్ కి మొబైల్ ఆప్ లో  push notification చేరుతుంది.

టీచర్స్ స్టూడెంట్స్ యొక్క Attendance , వారి తీరు గురుంచి పేరెంట్స్ తో షేర్ చేసుకోవచ్చు.స్కూల్ కార్యక్రమాలు, ఇతరత్రా విషయాలు స్టూడెంట్స్ పేరెంట్స్ తో డైరెక్ట్ గా పంచుకోవచ్చు.స్టూడెంట్స్ యొక్క Attendance ఎలక్ట్రానిక్ రికార్డులుగా పొందుపరచవచ్చు.

అలానే పేరెంట్స్ తమ పిల్లల ప్రగతి గురుంచి టీచర్స్ తో ప్రైవేటు గా చాట్ చెయ్యొచ్చు. అంటే వ్హట్స్ అప్ప గ్రూప్ లా కాకుండా విడివిడిగా వ్యక్తిగతంగా మాట్లాడవచ్చు.

Unihalt  టీం గురుంచి వివరిస్తారా ?

నేను(రవితేజ)  బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీ నుండి Electronics and Instrumentation ఇంజనీరింగ్ చేసాడు. కొన్ని రోజులు ఒక కంపెనీలో వర్క్ చేసాక తనలోని entrepreneur ఊరికినే కూర్చోనియ్యలేదు. ఆ  ఆలోచనల నుండే ఈ start up పుట్టింది.

రవిరాజ బాచిలర్స్ డిగ్రీ చేసాడు. 15 ఏళ్ళ వయసు నుండే తను కోడింగ్ చేయటం ప్రారంభించాడు. Unihalt Chief technical Officer తను .టెక్నాలజీ సంభందించిన విషయాలు ఎక్కువగా తనే చూసుకుంటాడు.

మాతో పాటు మా మెయిన్ టీం లక్ష్మణ్ , ఆశిష్, వికాస్ రెడ్డి.

unihalt team

Unihalt  బిజినెస్ మోడల్ ఏంటి ?

Institutes, టీచర్స్ ఈ సర్వీస్ ఫ్రీ గా వాడుకోవచ్చు. బయో మెట్రిక్ యంత్రం కావాల్సిన Schools & Colleges మాత్రం సెక్యూరిటీ అమౌంట్ కట్టాలి.
స్టూడెంట్ పేరెంట్స్ మాత్రం ఇయర్ కి 300 Rs కట్టి ఈ సర్వీస్ కి SubScribe అవ్వచ్చు.

ప్రస్తుతం 25 Institutes వరకు ఈ Unihalt అప్లికేషను సర్వీస్ ని వాడుతున్నాయి. ఇంకా, చాలా మంది ఈ సర్వీస్ వాడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

ఒక USA ఇన్వెస్టర్ మా కంపెనీ లో ఇన్వెస్ట్ చేయటానికి ఇంట్రెస్ట్ గా ఉన్నారు.

Unihalt భవిష్యత్తు ప్లాన్స్  ఏంటి ?

వచ్చే పది నెలలలో 100 Institutes మా సర్వీస్ Subscribe అవ్వటం టార్గెట్ గా పెట్టుకున్నాము.మాకు వచ్చే రెస్పాన్స్ బట్టి అది ఈజీ గా అందుకుంటాము  అని భావిస్తున్నాము.

Unihalt ఆప్ మరియు వెబ్ సైట్ లింక్ :

ఒక మంచి మొబైల్  ఆప్ తో మంచి సర్వీస్ అందిస్తున్న Unihalt టీం తాము అనుకున్న లక్ష్యం  చేరుకోవాలి అని  కోరుకుంటున్నాము.

 About Blog Author
నా పేరు రవికిరణ్. Entrepreneur - Digital Marketing Analyst and Blogger.

Startups,Social Media,Digital Marketing,Online Business,Online Money నాకున్న  knowledge & Experience ఈ బ్లాగ్ లో తెలుగు లో రాస్తున్నాను.

ఇంటరెస్ట్ ఉన్న వారు నా Facebook Profile ​ Follow  అవ్వండి
SUBSCRIBE Our Youtube Channel for Videos

Comment using Facebook for quick reply

క్రింద కామెంట్ చేసి మీ అభిప్రాయం తెలియచేయండి..నలుగురితో షేర్ చేసుకోండి

హాయ్... నా పేరు రవికిరణ్. స్మార్ట్ తెలుగు బ్లాగ్ Founder & Writer

ఆన్ లైన్ బిజినెస్ - బ్లాగింగ్ - స్టార్ట్ అప్స్ గురించి ఆర్టికల్స్ డైరెక్ట్ గా ఈ-మెయిల్  పొందటానికి, నాతో ఈ-మెయిల్ ద్వారా టచ్ లో ఉండటానికి మీ పేరు, ఈ-మెయిల్ ఇచ్చి Subscribe అవ్వండి. 

Subscribe Now

 About Blog Author
నా పేరు రవికిరణ్. Entrepreneur - Digital Marketing Analyst and Blogger.

Startups,Social Media,Digital Marketing,Online Business,Online Money నాకున్న  knowledge & Experience ఈ బ్లాగ్ లో తెలుగు లో రాస్తున్నాను.

ఇంటరెస్ట్ ఉన్న వారు నా Facebook Profile ​ Follow  అవ్వండి
SUBSCRIBE Our Youtube Channel for Videos
error: Content is protected !!