ఒక కస్టమర్ – ఒక సోప్ బార్ – ఒక స్మార్ట్ ఫోన్

0
OKA CUSTOMER_BOX

ముంబై లో నివసిస్తున్న లక్ష్మి నారాయణ్ కృష్ణమూర్తి అనే వ్యక్తి ,స్నాప్ డీల్ ఈ-కామర్స్ వెబ్ సైట్ నుండి  samsung galaxy స్మార్ట్ ఫోన్ ఆర్డర్ చేసాడు. అయితే ఇంటికి డెలివరీ అయిన ప్యాక్ లో ఫోన్ కి బదులు విమ్ బార్ , ఇటుక రాయి వచ్చింది. దాన్ని అయన ఫోటో తీసి పేస్ బుక్ లో “ఫోన్ ఆర్డర్ చేస్తే సోప్ బార్ వచ్చిందని ” అక్టోబర్ 24 న షేర్ చేసాడు. అనుకోకుండా ఆ పోస్ట్ కి విపరీతమయిన రెస్పాన్స్ వచ్చి 20,000 షేర్స్ పైగా అయింది.

Snapdeal post

 

6 రోజుల తర్వాత అంటే అక్టోబర్ 28 2014 న అయన ఈ విషయం పై మళ్లి పోస్ట్ చేసారు,” స్నాప్ డీల్ తన మనీ తనకి వాపసు ఇస్తానంది అని , అలానే తనకి జరిగిన సంఘటన కి,

ఆసౌకర్యానికి క్షమించమని అడిగిందని” ఆ పోస్ట్ లో పేర్కొన్నారు . అలానే అసలు ప్రాబ్లం కొరియర్ చేసే వాళ్ళ దగ్గర జరిగిందని స్నాప్ డీల్ వివరించిందని అయన చెప్పారు.

ఇంతవరకు కథ బానే ఉంది అయితే ఇక్కడే ఒక చిన్న గమ్మతయిన సంఘటన జరిగింది.ఇంత జరిగిన కథలో మనం ఒక ఐటెం ఇంపార్టెన్స్ మర్చిపోయాం, అదే “విమ్ సోప్ బార్”.

పేస్ బుక్ లో 20,000 షేర్స్ ,అలానే మీడియా లో పాపులర్ అయిన ఈ విషయాని విమ్ బార్ వెనక ఉన్న దాని కంపెనీ HUL(Hindustan Unilever Limited) ) సంస్థ గమనించి , అసలు కస్టమర్ సర్వీస్ అంటే ఏంటో తెలియజేసింది .

అవును మరి “ఏ ఫోన్” అయితే లక్ష్మి నారాయణ్ కృష్ణమూర్తి గారు స్నాప్ డీల్ లో ఆర్డర్ చేసి విమ్ బార్ పొందారో , ఆ ఫోన్ ను HUL గిఫ్ట్ గా అందజేసింది.ఫోన్ తో పాటు విమ్ లిక్విడ్ సోప్ బాటిల్స్ కూడా పంపింది.

అలానే ఆ లెటర్ లో ఈ క్రింద విధంగా పేర్కొంది.
“మీకు జరిగిన సంఘటనకి చింతిస్తున్నాం, దీనీలో మా ప్రమేయం ఎం లేకుండానే మా బ్రాండ్ విమ్ ని వాడటం జరిగింది . విమ్ బ్రాండ్ మా సంస్థ కి ఎంతో వీలువయినది. మీమల్నిసంతోష పెట్టటానికి మా నుంచి ఒక చిరు కానుక” అని పేర్కొంది.

దానితో అయన చాలా సంతోష పడి , ఆ ఫోన్ ని , HUL లెటర్ ని పేస్ బుక్ లో పోస్ట్ చేసాడు.

HUL Response

కొంతమంది HUL మార్కెటింగ్ టెక్నిక్ ఫాలో అయిందని,పాపులర్ అయిన విషయం తో పాపులారిటీ తెచ్చుకుంది అన్నారు.Snapdeal కొద్దిగా కస్టమర్ తరుపున అలోచించి HUL చేసిన పని చేసుంటే తనకి కలిగిన చెడ్డ పేరు ని మాఫీ చేసుకునేది, కాని వాళ్ళు ఒక “సారీ తో”, కస్టమర్ కట్టిన మనీ తనకే ఇచ్చి చేతులు దులుపుకున్నారు, కాని అసలు కస్టమర్ ని ఎలా ట్రీట్ చెయ్యాలో HUL చూపించింది.

ఏది ఏమయినప్పటికీ ఆన్ లైన్ లావాదేవిల పై మన ఇండియాన్స్ డౌట్ పడటానికి ఇటువంటి సంఘటనలు బలోపేతం చేస్తునాయి.ఎందుకంటే ఈలాంటి సంఘటనలు (ఒక వస్తువు బదులు ఇంకోటి, లేదా ఇటుక రాళ్ళూ రావడం)ఇదివరకు కుడా జరిగాయి.
అయితే ఈ-కామర్స్ వెబ్ సైట్స్ ఎప్పుడో ఒక్కసారి జరిగే ఇటువంటి పొరపాట్లు మళ్లి జరగకుండా చూసుకుంటే మంచిది.డెలివరీ వాళ్ళ మీదో, కొరియర్ వాళ్ళ మీదో డిపెండ్ అయ్యే బదులు తామే సొంత లాజిస్టిక్స్ పెట్టుకుంటే ఇటువంటివి రిపీట్ అవ్వవు.

వేల కోట్లు ఇన్వేస్తేమెంట్ లు పెట్టటం కంటే , అదిరిపోయే ఆఫర్లు అని మార్కెట్ చేసుకునే కంటే , కస్టమర్ కి ప్రాబ్లం రాకుండా ఐటమ్స్ కరెక్ట్ గా వచ్చేటట్టు , అలానే ఏదయినా ప్రాబ్లం వస్తే వెంటనే దాని సాల్వ్ చేసేటట్టు ప్లాన్ చేసుకుంటే మంచిది.

మీరేమంటారు …మీ కామెంట్స్ కింద తెలియచేయండి .ఈ పోస్ట్ మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి 

Comment using Facebook for quick reply

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here