youtube Introduction in Telugu-Guest Article

0
YOUTUBE INTRODUCTION
 యూత్ లో ని టాలెంట్ ని ఎంకరేజ్ చేయటానికి స్మార్ట్ తెలుగు నుండి నేను Guest articles స్వీకరిస్తున్నాను. అలా ఇంకో మంచి క్రియేటివ్ ఆర్టికల్ ఈ రోజు మహేష్ కుమార్  రాతతో మీకోసం.
యూట్యూబ్ లో ని అవకాశాల గురించి  గురించి పరిచయం మరియు కొన్ని పాపులర్ యూట్యూబ్ ఛానెల్ పేర్లు.
“వై దిస్ కొలవెరి కొలవెరి కొలవెరి డీ…… ఒప్పా గంగం స్టయిల్, హనీ సింగ్ బ్లూ ఐస్ సాంగ్ , రీసెంట్ గా బాహుబలి, కబాలి”   ఇవి మొదట మనం ఎక్కడ చూసాం అనగానే వెంటనే  గుర్తోచ్చేది ‘యూట్యూబ్’ !ఇవి యూట్యుబ్ లో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.
టాలెంట్ కి హద్దులు, ఎల్లలు లేవు అని నిరూపించుకోవడానికి మనకి ఇంత కన్నా అమూల్యమైన, విలువైన వేదిక ఇంకొకటి లేదు అని చెప్పడానికి ఆలోచించాల్సిన అవసరం లేదు.

యూట్యూబ్  లో సినిమాలు సీరియళ్లు గురించి కొద్దిగా ?

“అరే మామా ! ఈ రోజు మా హీరో సినిమా టీజర్/ట్రైలర్ చూశావా భారతదేశం లో ఏ హీరో సినీమా కి రాని వీక్షణలు వచ్చాయి”.
మా వాడు తీసిన షార్ట్ ఫిల్మ్ ను యూట్యూబ్ లో చూసి ఒక ప్రముఖ డైరెక్టర్ తన సినిమా లో అవకాశం ఇచ్చాడట తెలుసా !!
 “వదిన నేను నిన్న రాత్రి వచ్చిన సీరియల్ చూడలేదు, ఏం పర్వాలేదు నువ్వు ఆ సీరియల్ ఎప్పుడైనా చూడోచ్చు.. ఏలా వదినా ? యూట్యూబ్ ఉంది కదా”.
 సినిమాలు, పాటలు, వంటలు, క్రియెటివ్ వీడీయోలు, లైవ్ ఈవెంట్స్ ఇలాంటి వాటన్నింటిని మనం చూడవచ్చు.
 కొందరికి హాలీవుడ్ సినిమాలు చూడాలని ఉంటుంది కానీ అప్పటికే మన ఊర్లో సినిమా కొన్ని రోజులు ఆడిన తర్వాత తీసేయడం జరుగుతుంది.. ఇప్పుడు ఆ సినిమా మళ్ళీ చూడలంటే ఎలా..??
మనం ఒక సారి మన పాత రోజులు గుర్తు చేసుకుందాం. థియేటర్ లో సినిమా తీసేసిన తర్వాత ఆ సినిమా ప్రొడ్యుసర్లు కాని, లేదా ఆ సినిమా ను కొన్న వాళ్ళు సి.డి., డి.వి.డి లు రిలీజ్ చేసే వాళ్ళు, మనం వాటిని కొని ప్లేయ్ర్స్ లో వేసుకుని చూసేవాళ్ళమని  గుర్తుంది కదా, అలాగే యూట్యూబ్ లో కూడా కొన్ని సినిమాలకు రెంట్ పే చేసి చూడవచ్చు.
ఒక పెద్ద తెర నుండి చేతి లో ఇమిడి పోయే మోబైల్ బుల్లితెరలో మనకి నచ్చిన వీడియోలు చూడోచ్చు…..  మనకి నచ్చిన వీడియో చుస్తూన్నప్పుడు ఆ సమయానికి ఎదో ఒక పని వల్ల దాన్ని ఆపేసి వెళ్ళాల్సిన పని లేకుండా ఆఫ్ లైన్ లో సేవ్ చేసుకుని మనకి సమయం దొరికినపుడు చూసుకోవచ్చు..

యూట్యూబ్ సృష్టిస్తున్న అవకాశాలు ?

 ఇది యూట్యూబ్ సృష్టిస్తున్న ప్రస్తుత ట్రెండ్. ‘ఇంతింతై వటుడింతై’ అన్నట్టు ప్రస్తుత పోటి ప్రపంచానికి స్వాగతం పలుకుతూ, ఉత్సాహవంతులైన వ్యక్తులకు అటు మనీ సంపాదనకు, ఇటు వారి ప్రతిభకు వేదిక అయ్యింది.  ప్రపంచంలో అత్యదికమంది ప్రజలు గూగుల్ తర్వాత, యూట్యూబ్ నే ఫాలో అవుతున్నారు అంటే అది దాని ప్రాముఖ్యత.
చాలా మంది యువత దీనిని జీవనోపాధిగా ఎంచుకుంటున్నారు.
 • దీనిలో షార్ట్ ఫిల్మ్స్ తీసి సినిమాల్లోకి వెళుతున్నారు.
 • మొబైల్ రివ్యూలు చేస్తున్నారు.
 • టెక్నికల్ ట్రైనింగ్ ఇస్తున్నారు.
 • షార్ట్ ఫిల్మ్ మీద సంపాదిస్తున్నారు.
 • గేమింగ్ రివ్యూ చేస్తున్నారు.
 • సినిమా రివ్యూలు చేస్తున్నారు.
 • వంటలతో అదరగొడుతున్నారు.
 • అబ్బో….ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది.
మార్కెట్ లోని కొన్ని స్టాటిస్టిక్స్ ప్రకారం ఆ ఛానెళ్ల subscribers లిస్ట్ ఆధారంగా  ఇండియాలోని టాప్ యూట్యూబ్ చానెల్స్.

Top Youtube channels in india based on subscribers in June 2016:

 1. T-Series
 2. zee tv
 3. ChuChu Tv Nursery Rhymes
 4. Videogyan 3D Rhymes
 5. AFA Tube
 6. YRF
 7. Zee music Company
 8. Colors Tv
 9. Chotoonz TV
 10. CVS 3D Rhymes

Some Interesting channels on youtube:

 • thegatesnotes
 • scishow
 • SmartEveryDay
 • History
 • TED
 • Vsauce
 • Topgear
 • LittleBabyBum
 మీ ట్యాలెంట్ ని కూడా యూట్యూబ్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేయలనుకుంటున్నారా..?   మన స్మార్ట్ తెలుగు ని ఫాలో అయితే అది మీకు కూడా సాధ్యమే !
Article written By Mahesh Kumar.

Comment using Facebook for quick reply

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here