యూట్యూబ్ వీడియో upload కోసం టిప్స్

యూట్యూబ్ లొ మన చానల్ సక్సెస్ ఫుల్ గా రన్ చేయాలంటే ముఖ్యంగా మంచి వీడియో కంటెంట్ ఉండాలి.
చాలా మంది మంచి కంటెంట్ అప్లోడ్ చేస్తారు గాని అక్కడినుండి ముందుకు కదలలేరు. మన తెలుగు లోనే చాలా మంది యువత టెక్నాలజీ మీద యూట్యూబ్ చానెల్స్ నడుపుతున్నారు కానీ , ఎవరికీ వాటి గురించి పెద్దగా తెలియదు.
కారణం, చాలా మంది తీసే కంటెంట్ మీదే దృష్టి పెడుతున్నారు.
వీడియో క్వాలిటీ కోసం వాడే సాఫ్ట్ వేర్లు , అప్లోడ్ చేసే ముందు గుర్తుంచ్చుకోవలిసిన టిప్స్ గురించి పట్టించుకోట్లేదు.
అలాంటివారికోసం నాకు తెలిసిన కొన్ని చిన్న టిప్స్ మీకోసం:
  1. వీడియోను  ఎడిటింగ్ చేయడానికి అడోబ్ ప్రీమియర్ లాంటిది ఉపయోగించి మనకి కావల్సిన సీన్స్ మాత్రమే ఉంచి మంచి క్వాలిటీ ఔట్ పుట్ తయారు చేయొచ్చు.
  2.  అలాగే పోస్టర్ డిజైన్ కోసం ఫోటోషాప్ తెలిసి ఉండాలి … ఇంకా ఈ సాఫ్ట్ వేరు వల్ల మీ యూట్యుబ్ కి కావల్సిన  కవర్ ఫొటో మరియు లోగో ను  డిజైన్ చేసుకొవచ్చు.
  3. Video Title షార్ట్ గా క్యాచిగా ఉండే వర్డ్స్ చూసుకోండి.
  4.  Video Description  లో వీడియో కి సంబంధించిన 4 లైన్స్ రాయండి.( వంటలకి సంబంధించింది  అయితే ఆ వంట  ఎలా వండుతారు.. షార్ట్ ఫిలింస్ అయితే దాని స్టోరి  ఆ వంట  గురించి కొద్దిగా  )
  5. Video Tags : మీరు అప్ లోడ్ చేసిన వీడీయో పబ్లిక్ సర్చ్ చేసినపుడు  ఆ వర్డ్ కొట్టగానే మీ వీడీయో రావాలి. (ex: Killing Veerappan Movie కోసం  Public ఇలా సర్చ్ చేస్తారు.  killing veerappan, Rgv movies, Ram gopal varma killing veerappan, killing veerappan telugu movie, telugu movies 2016 etc..)
  6. మన వీడియోకి వ్యూస్ రావలంటే సోషియల్ మీడియా కూడా ముఖ్యం .ముఖ్యంగా Google+ , Facebook, Twitter, Pinterst లాంటి వాటి లో మీ బ్రాండ్/బ్యానర్ పేరు మీద ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొండి.
చివరగా ఒక మాట,  ఒక చానెల్ స్టార్ట్ చేయగానే డబ్బులు వస్తాయి అని అనుకొకూడదు.
కొంత టైం పడుతుంది, ఒక వీడియో మేకింగ్ చేస్తున్నప్పుడు Present Trend కి తగ్గట్టు ఉందా లేదా,  నలుగురికి ఉపయోగ పడుతుందా అన్న విషయం కూడా గుర్తుంచుకోవాలి.
మీ ట్యాలెంట్ ని కూడా యూట్యూబ్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేయలనుకుంటున్నారా..?   మన స్మార్ట్ తెలుగు ని ఫాలో అయితే అది మీకు కూడా సాధ్యమే !
Guest Article By Mahesh Kumar

Comment using Facebook for quick reply

క్రింద కామెంట్ చేసి మీ అభిప్రాయం తెలియచేయండి..నలుగురితో షేర్ చేసుకోండి

హాయ్... నా పేరు రవికిరణ్. స్మార్ట్ తెలుగు బ్లాగ్ Founder & Writer

ఆన్ లైన్ బిజినెస్ - బ్లాగింగ్ - స్టార్ట్ అప్స్ గురించి ఆర్టికల్స్ డైరెక్ట్ గా ఈ-మెయిల్  పొందటానికి, నాతో ఈ-మెయిల్ ద్వారా టచ్ లో ఉండటానికి మీ పేరు, ఈ-మెయిల్ ఇచ్చి Subscribe అవ్వండి. 

Subscribe Now
error: Content is protected !!